చిరంజీవి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావడం నా అదృష్టం..
- October 31, 2016
చిరంజీవి 150 సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కావడం తన అదృష్టమని నటుడు తరుణ్ ఆరోరా అన్నాడు. తనకు ఇంతకన్నా మంచి లాంచింగ్ దొరకదని పేర్కొన్నాడు. ఖైదీ నంబర్ 150 సినిమాలో అతడు విలన్ గా నటిస్తున్నాడు.చిరంజీవి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇంతకన్నా మంచి అవకాశం ఏముంటుంది. ఇదో గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాను. మాతృకతో పోలిస్తే తెలుగు వెర్షన్ లో చాలా మార్పులు చేశారు. దర్శకుడు చెప్పినట్టుగా చేసుకుపోతున్నాను. నన్ను వివి వినాయక్ బాగా ప్రోత్సహిస్తున్నారు. షూటింగ్ అంతా సవ్యంగా సాగుతోందని తరుణ్ ఆరోరా చెప్పాడు.హిందీలో పలు చిత్రాల్లో నటించిన తరుణ్ తమిళంలో కనిదన్ చిత్రంలో యాక్ట్ చేశారు.ఆ చిత్రంలో నటన నచ్చి, చిత్రదర్శకుడు వినాయక్ విలన్గా తీసుకున్నాడు. అన్నట్లు ఈ తరుణ్ అరోరా ఎవరో కాదు.. తెలుగులో పలు చిత్రాల్లో నటించి, గుర్తింపు తెచ్చుకున్నహీరోయిన్ అంజలా జవేరి భర్త.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







