సహజ ఔషదాలు వైరల్ జ్వరాన్ని తగ్గించే శక్తిని కలిగి ఉంటాయి...
- October 31, 2016
వాతావరణంలో మార్పులకు అనుగుణంగా వ్యాపించే వ్యాధులు, కాలానుగుణ లేదా రుతుమార్పుల వలన సంక్రమించే వ్యాధులు మరియు వైరల్ ఫీవర్ వంటి సంక్రమణలు మనలో చాలా మందిని వ్యాధుల భారినపడేలా చేస్తాయి. ప్రతిసారి వైరల్ జ్వరం రాగానే మనం వివిధ రకాల యాంటీ బయటిక్ మందులను, అల్లోపతి మందులను వాడుతుంటాము. కానీ, వీటికి సహజ ఔషదాలను ఎందుకు వాడకూడదు? వైరల్ ఫీవర్ ను తగ్గించుటకు చాలా రకాల సహజ ఔషదాలు అందుబాటులో ఉన్నాయి మరియు ఇవి శక్తి వంతంగా పని చేస్తాయి. అంతేకాకుండా, వీటి వలన దుష్ప్రభావాలు కలుగుతాయని భావించకండి. ఇవి మనందరికీ చాలా ఆరోగ్యకరం. వైరల్ ఫీవర్ ను తగ్గించే కొన్ని రకాల సహజ ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
Natural remedies for viral fever in Telugu
కొత్తిమీరతో చేసిన టీ
కొత్తిమీర విత్తనాలు అనేక విటమిన్ మరియు ఫైటోన్యూట్రిఎంట్స్ అధిక మొత్తంలో ఉండి, శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీనితో పాటుగా, వీటిలో ఉండే యాంటీ బయాటిక్ సమ్మేళనాలు మరియు పోషక అస్థిర నూనెలు సమర్థవంతంగా వైరల్ ఫీవర్ ను తగ్గిస్తాయి.
తయారీ విధానం
ఒక చెంచా కొత్తిమీర విత్తనాలను ఒక గ్లాసు నీటిని కలపండి. ఈ మిశ్రమాన్ని వేడి చేసి, చల్లారే వరకు వేచి ఉండండి. చల్లారిన తరువాత దీనికి కొద్దిగా పాలు మరియు చక్కెర కలపండి. ఇలా చేసిన మిశ్రమాన్ని తాగటం వలన వైరల్ ఫీవర్ తగ్గుతుంది.
తులసి ఆకులు
వైరల్ ఫీవర్ ను తగ్గించురలో తులసి ఆకులు శక్తి వంతంగా పని చేస్తాయి. తులసి ఆకులు యాంటీ బాక్టీరియల్, రోగక్రిమి నాశక, యాంటీ బయాటిక్ మరియు ఫంగల్ గుణాలను కలిగి ఉంటుందని మన అందరికి తెలిసిందే. ఈ గుణాలను కలిగి ఉండే తులసి వైరల్ ఫీవర్ ను శక్తి వంతంగా తగిస్తుంది.
ఎలా వాడటం?
20 తాజా తులసి ఆకులను తీసుకొని వాటిని శుభ్రపరచి, 1 లీటర్ నీటిలో కలపండి. సగం చెంచా లవంగాల పొడిని ఈ మిశ్రమానికి కలపండి. ఈ మిశ్రమాన్ని నీరు సగం వచ్చే వరకు వేడి చేయండి. వైరల్ ఫీవర్ ఉన్న వ్యక్తి ప్రతి రెండు గంటలకు ఒకసారి ఈ డికాషన్ ను దాగటం వలన సమస్య నుండి ఉపశమనం పొందుతారు.
పొడి అల్లం మిశ్రమం
అల్లం వలన కలిగే ప్రయోజనాల కారణంగా దీనిని పవర్ హౌస్ గా పేర్కొంటారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ మరియు అనాల్జెసిక్ గుణాలను కలిగి ఉండే అల్లం వైరల్ ఫీవర్ ను త్వరగా తగ్గిస్తుంది. వైరల్ ఫీవర్ తో భాదపడే వారు అల్లంను తేనెతో కలుపుకొని తినటం వలన ఈ జ్వరం వలన కలిగే అసౌకర్యాల నుండి ఉపశమనం అందిస్తుంది.
ఎలా వాడటం?
రెండు సాధారణ పరిమాణంలో ఉన్న పొడి అల్లం ముక్కలను, ఒక కప్పు నీటిలో కలిపి వేడి చేయండి. మిశ్రమం చల్లారిన తరువాత రోజులో 3 నుండి 4 సార్లు దీనిని తాగటం వలన వైరల్ ఫీవర్ మరియు వాటి లక్షణాల నుండి ఉపశమనం పొందుతారు.
పైన తెలుపబడిన ఈ సహజ ఔషదాలు కాలానుగుణ వైరల్ ఫీవర్ నుం తప్పక తగ్గిస్తాయి
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









