సౌదీలో ఈ షాపు.. స్త్రీలకు మాత్రమే
- November 01, 2016
నేరాలను అదుపులోకి తెచ్చేందుకు ఎంత కఠిన చట్టాలు చేసినా సౌదీలో మాత్రం ఆకతాయిల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలపై వేధింపుల పర్వానికి కొందరు దుండగులు తెరతీస్తున్నారు. అందుకే అలాంటి వారి నుంచి తప్పించుకునేందుకు మర్యామ్ అల్ సుబాయ్ అనే ఓ సౌదీ మహిళ వినూత్న నిర్ణయం తీసుకుంది. రియాద్‌కు చెందిన ఆమె.. ఓ మొబైల్ షాప్‌ను నిర్వహింస్తూ... మహిళలకు మాత్రమే అనే బోర్డ్ పెట్టింది. రీచార్జి కోసం నెంబర్ తీసుకోవడం.. దాని ద్వారా బెదిరింపులకు పాల్పడటం, అసభ్య సందేశాలు పంపడం వంటివి చేస్తుంటారని అందుకే వాటి నుంచి స్త్రీలను బయటపడేలా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతోందామె. రిపేరుకు వచ్చిన ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌లో ఉన్న ఫోటోలను తీసుకుని కొందరు చెడు ప్రయోజనాలకు వాడుతుంటారని, అలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని సుబాయ్ చెబుతోంది. మరి ఆ షాప్‌కు సంబంధించిన వీడియోను మీరూ ఓ లుక్కేయండి...
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







