గడ్డాలు పెంచాలని హకుం జారీ చేసిన ఉగ్రవాదులు
- November 01, 2016
ఇరాక్‌లోని ఇస్లామిక్‌స్టేట్ ఆధీనంలోని ఓ ప్రాంతం.. సాధారణ పౌరులను గడ్డాలు పెంచాలని ఉగ్రవాదులు హకుం జారీచేశారు... కొన్ని రోజుల అనంతరం కొందరు పౌరులను కూడలి వద్దకు తీసుకువచ్చారు. ఒక్కొక్కరి గడ్డంలో పెన్ను పెట్టారు.. కొందరి గడ్డాల నుంచి అవి కిందపడిపోయాయి... వారు సరిగ్గా గడ్డం పెంచలేదని అందుకు శిక్షగా కొరడా దెబ్బలతో శిక్షించారు... ఇలాంటి అనేకమైన చిత్ర విచిత్రమైన శిక్షలు ఇస్లామిక్ స్టేట్ పాలనలో వున్నట్టు ఇరాకీ దళాల రాకతో విముక్తి చెందిన ప్రాంతాల వారు వెల్లడించారు. ఇరాకీ దళాలు, పెష్మెర్గ దళాలు కొద్ది రోజుల క్రితం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆధీనంలో వున్న మోసూల్ ప్రాంతంపై దాడులు ప్రారంభించారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా అనేక గ్రామాలు, పట్టణాలను ఐఎస్ నుంచి విముక్తిచేశారు. ఐఎస్ పాలన అంతం కావడంపై బాధిత ప్రజలు హర్షం వ్యక్తంచేశారు.
సిరియాలోనూ..
సిరియాలో ఇస్లామిక్‌స్టేట్ ఉగ్రవాదుల ఆధీనంలో వున్న ప్రాంతాల్లోనూ ఇదే రకం శిక్షలు అమలవుతున్నాయి. సిగరెట్లు కాల్చినందుకు బెత్తంతో శిక్ష విధించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







