గడ్డాలు పెంచాలని హకుం జారీ చేసిన ఉగ్రవాదులు

- November 01, 2016 , by Maagulf
గడ్డాలు పెంచాలని హకుం జారీ చేసిన ఉగ్రవాదులు

ఇరాక్‌లోని ఇస్లామిక్‌స్టేట్‌ ఆధీనంలోని ఓ ప్రాంతం.. సాధారణ పౌరులను గడ్డాలు పెంచాలని ఉగ్రవాదులు హకుం జారీచేశారు... కొన్ని రోజుల అనంతరం కొందరు పౌరులను కూడలి వద్దకు తీసుకువచ్చారు. ఒక్కొక్కరి గడ్డంలో పెన్ను పెట్టారు.. కొందరి గడ్డాల నుంచి అవి కిందపడిపోయాయి... వారు సరిగ్గా గడ్డం పెంచలేదని అందుకు శిక్షగా కొరడా దెబ్బలతో శిక్షించారు... ఇలాంటి అనేకమైన చిత్ర విచిత్రమైన శిక్షలు ఇస్లామిక్‌ స్టేట్‌ పాలనలో వున్నట్టు ఇరాకీ దళాల రాకతో విముక్తి చెందిన ప్రాంతాల వారు వెల్లడించారు. ఇరాకీ దళాలు, పెష్‌మెర్గ దళాలు కొద్ది రోజుల క్రితం ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల ఆధీనంలో వున్న మోసూల్‌ ప్రాంతంపై దాడులు ప్రారంభించారు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా అనేక గ్రామాలు, పట్టణాలను ఐఎస్‌ నుంచి విముక్తిచేశారు. ఐఎస్‌ పాలన అంతం కావడంపై బాధిత ప్రజలు హర్షం వ్యక్తంచేశారు.
సిరియాలోనూ.. 
సిరియాలో ఇస్లామిక్‌స్టేట్‌ ఉగ్రవాదుల ఆధీనంలో వున్న ప్రాంతాల్లోనూ ఇదే రకం శిక్షలు అమలవుతున్నాయి. సిగరెట్లు కాల్చినందుకు బెత్తంతో శిక్ష విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com