వరుణ్ తేజ్, నిహారికలు దెయ్యాల గెటప్ లో ...
- November 02, 2016
గత రెండు రోజులు నుండి హాలోవీన్ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు హాలోవీన్ అనగా చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరు దెయ్యాలు, భూతాల గెటప్ లు వేసుకొని అందరిని అలరిస్తుంటారు. ఇటు యూకే లోను.. అటు అమెరికాలోను అక్టోబర్ 31 సాయంత్రం హాలోవీన్ ఈవెనింగ్ గా జరుపుకోవడం తర తరాల నుండి వస్తోంది. అక్కడి ఆచార వ్యవహారాలను మన వాళ్ళను కూడా పాటిస్తూ ఈ హాలోవీన్ డేని సరదాగా సెలబ్రేట్ చేసుకున్నారు. సెలబ్రిటీ ఫ్యామిలీస్ కూడా ఈ డేపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు . మెగా ఫ్యామిలీకి సంబంధించి వరుణ్ తేజ్, నిహారికలు దెయ్యాల గెటప్ లో కనిపించగా అల్లు అర్జున్ తనయుడు అయాన్ బ్యాట్ మన్ గెటప్ లో కనిపించి సందడి చేశాడు.సోషల్ మీడియాలో ఈ హాలోవీన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరు ఈ హాలోవీన్ గెటప్ లో రెడీ అవుతూ తమ పిక్స్ ని అప్ లోడ్ చేస్తున్నారు. ఇక మంచు విష్ణు తను నిర్వహిస్తున్న న్యూయార్క్ అకాడమీ - ప్రోగ్రెసివ్ అమెరికన్ స్కూల్ విద్యార్ధులతో ఈ హాలోవీన్ డేని పెద్ద పార్టీగా సెలబ్రేట్ చేశాడు. ఈ కార్యక్రమంలో ఆ స్కూల్ కు చెందిన పలువురు చిన్నారులు హాలోవీన్ గెటప్స్ తో సందడి చేశారు. వారితో పాటు మంచు మనోజ్ కూడా ఈ హాలోవీన్ గెటప్ వేసుకొని హడావిడి చేశాడు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







