మెట్రో క్రేన్ కింద నలిగి ఓ అభాగ్యుడు మరణించాడు

- November 02, 2016 , by Maagulf
మెట్రో క్రేన్ కింద నలిగి ఓ అభాగ్యుడు మరణించాడు

మెట్రో క్రేన్ కింద నలిగి ఓ అభాగ్యుడు మరణించాడు.  అతనికి దాదాపు 50 ఏళ్ళ వయస్సుంటుంది.  క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే అతడు మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.  వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని గాంధీభవన్ మొజాంజాహి మార్కెట్ వద్ద జరిగింది.  పుట్ పాత్ పై నిద్రిస్తున్న అతనిపై క్రేన్ వెళ్ళింది.  క్రేన్ భారీగా ఉండడంతో డ్రైవర్ కు ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి కనిపించలేదని అంటున్నారు.  అటుగా వెళుతున్న ప్రయాణీకులు గమనించి క్రేన్ డ్రైవర్ ను అప్రమత్తం చేశారని, అయితే అప్పటికే అతను మరణించాడని అంటున్నారు.  క్రేన్ డ్రైవర్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.  నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.  మృతుడి వివరాలు తెలియలేదు.  శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. - See more 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com