పోలీసుల కూంబింగ్, తనిఖీలు ముమ్మరం చేశారు

- November 02, 2016 , by Maagulf
పోలీసుల కూంబింగ్, తనిఖీలు ముమ్మరం చేశారు

ఒడిశా.. మల్కన్ గిరి, ఏవోబీ ప్రాంతంలో హై అలర్ట్.. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా గురువారం అయిదు రాష్ట్రాల్లో బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసుల కూంబింగ్, తనిఖీలు ముమ్మరం చేశారు.మహారాష్ట్ర, ఛత్తీస్ గద్, ఒడిషా, తెలంగాణా, ఏపీ రాష్ట్రాల్లో పూర్తి బంద్ పాటించాలని మావోయిస్టులు పత్రికా ప్రకటనలు, పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేశారు మావోయిస్టు అగ్ర నేత ఆర్కే జాడ ఇంకా తెలియకపోవడంతో... ఈ బంద్ ను ఎలాగైనా విజయవంతం చేయాలని మావోయిస్టులు కృత నిశ్చయంతో ఉన్నారు.అటు- . ఏవోబీ సరిహద్దు ప్రాంతాల్లోకి ఒకరోజు ముందుగానే పారామిలిటరీ దళాలు చేరుకున్నాయి. పోలీసుల సూచనలమేరకు ప్రజా ప్రతినిధులంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారు.భద్రాద్రి జిల్లా చర్ల, దుమ్ముగూడెం, ఇల్లెందు వంటి ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసు బలగాలను మొహరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com