పింఛన్ పథకం'ఆసరా'కు ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియ...
- November 05, 2016
సామాజిక భద్రతా పింఛన్ పథకం'ఆసరా'కు ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియను నూరుశాతం అమల్లోకి తేవాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్ణయించింది. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద ఆసరా పింఛన్ పొందుతున్న 35,58,486 మందిలో ఇప్పటికే 99.32 శాతం మంది తమ ఆధార్‌తో అనుసంధానమైనట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీంతో మిగిలిన 24,265 (0.68 శాతం) మందిని కూడా ఆధార్‌తో అనుసంధానించేందుకు అధికారులు అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ విషయమై ఇప్పటికే అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులకు, అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు సెర్ప్ నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు తె లుస్తోంది.జనవరి నుంచి ఆధార్ పక్రియను పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు సెర్ప్ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం మొత్తం ఆసరా లబ్ధిదారుల్లో 37 శాతం మందికి బ్యాంకు ఖాతాల ద్వారా, 50 శాతం మందికి పోస్టాఫీసుల ద్వారా పింఛన్ సొమ్మును అందిస్తుండగా మిగిలిన 13 శాతం మందికి పంచాయతీ కార్యదర్శులే నేరుగా అందిస్తున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మాన్యువల్‌గా పింఛన్ పంపిణీ చేసే ప్రాంతాల్లో ఎక్కడోచోట అవక తవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును వారి బ్యాంకు ఖాతా లేదా పోస్టాఫీసుల ద్వారానే అందజేయాలని తాజాగా నిర్ణయించిన సెర్ప్... ఇందుకు ఆధార్‌ను అనుసంధానించనుంది.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







