'న్యూస్ టైం అస్సాం, 'కేర్ వరల్డ్ టీవీ' చానల్‌ను ప్రభుత్వం నిషేధించింది...
- November 05, 2016
'ఎన్డీటీవీ ఇండియా' చానల్‌పై నిషేధం విధించడాన్ని విపక్షాలు తప్పుబడుతుండగానే కేంద్ర ప్రభుత్వం మరో రెండు చానళ్లపై వేటు వేసింది. 'న్యూస్ టైం అస్సాం' చానల్ పలుసార్లు మార్గదర్శకాలను ఉల్లంఘించి, క్షమాపణ కోరుతూ సవరణ ప్రసారం చేయమన్నా చేయలేదు. దీంతో నవంబర్ 9 అర్ధరాత్రి నుంచి 10 అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ఆ చానల్ ప్రసారాలు నిలిపివేయాలని సమాచార, ప్రసారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.యజమాని చేతిలో దారుణ చిత్రహింసలకు గురైన పని పిల్లవాడి గుర్తింపు తెలిపేలా ఈ చానల్ ప్రసారాలు చేసి, అతని గౌరవానికి భంగం కలిగించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2013లోనే చానెల్‌పై నిషేధం విధించాలని మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినా అప్పట్లో అమలు కాలేదు.మరో ఉత్తర్వులో 'కేర్ వరల్డ్ టీవీ' అనే చానల్‌ను కూడా ప్రభుత్వం నిషేధించింది. అభ్యంతరకర దృశ్యాలను చూపించడంతో నవంబరు 9 నుంచి ఈ చానల్ ప్రసారాలను వారం రోజులపాటు నిషేధించింది
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్‌లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్‌కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..