నిషిద్ధాక్షరాలు....!!
- November 05, 2016నిలకడలేని ఆలోచనా సంద్రాన్ని
మోపలేని మది మౌన భారాన్ని
తేటతెల్లం చేసే భావాలు అలిగిన వేళ
జీవకణాలు చేతనాన్ని కోల్పోతున్నప్పుడు
చీకటి చుట్టం పరామరికకు వచ్చినప్పుడు
వెలుగుదారులు మూసుకుంటున్న వేళ
గుండె గది గుట్టుగా దాచిన జ్ఞాపకాలు
వదిలేసినా వెంబడిస్తుండే వాస్తవాలు
అన్ని కలగాపులగంగా కలసిన వేళ
ఎప్పటికప్పుడు పడిలేస్తున్నా
తగిలిన గాయాల తడి తాకుతున్నా
ఒప్పుకోలేని ఓటమి గెలుపే నిషిద్ధాక్షరాలైన ఈ అక్షరాలు...!!
--మంజు యనమదల(విజయవాడ)
తాజా వార్తలు
- అల్ బురైమిలో డ్రగ్స్.. ప్రవాసుడు అరెస్టు..!!
- నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ ప్రారంభించిన కింగ్ సల్మాన్..!
- యూఏఈ నివాసితులు జీవితాన్ని మార్చేసిన వీసా క్షమాభిక్ష..!!
- చెల్లింపు లింక్‌ల కోసం కొత్త స్క్రీన్.. కువైట్ సెంట్రల్ బ్యాంక్..!!
- హమద్ పోర్ట్‌లో 1,700 కిలోల నిషేధిత పదార్థం సీజ్..!!
- బహ్రెయిన్ లో మరో 15 ట్రాఫిక్ సర్వీసులు డిజిటైజ్..!!
- లడ్డు బాధ్యుల పై చర్యలు: డిప్యూటీ సీఎం పవన్
- తిరుమల లడ్డూ వివాదం..హైకోర్టులో వైసీపీ పిటిషన్
- ఏపీ: నేటి నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్.. అందుబాటులోకి పోర్టల్
- అల్ మక్తూమ్ బ్రిడ్జి.. జనవరి 16 వరకు తాత్కాలికంగా మూసివేత..!!