భారతదేశం, జపాన్ మధ్య కుదరనున్న పౌర అణు ఒప్పందం

- November 06, 2016 , by Maagulf
భారతదేశం, జపాన్ మధ్య కుదరనున్న పౌర అణు ఒప్పందం

భారతదేశం, జపాన్ మధ్య పౌర అణు ఒప్పందం కుదరబోతోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై సంతకం చేయని దేశం జపాన్‌తో ఇటువంటి ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. భారతదేశం అణ్వస్త్ర పరీక్ష జరిపితే ఇరు దేశాల మధ్య పౌర అణు సహకారం నిలిచిపోతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం మూడు రోజుల పాటు జపాన్‌లో పర్యటిస్తారు. ఆ సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని సమాచారం. దీనివల్ల మన దేశానికి అణు విద్యుత్తు కేంద్రాలను ఎగుమతి చేసేందుకు జపాన్‌కు అవకాశం కలుగుతుంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతుండటంతో జపాన్ మన దేశంతో అణు సహకారానికి ముందుకొచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com