అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి విజయం..
- November 08, 2016
అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి విజయం సాధించారు. తమిళనాడుకు చెందిన ఆయన.. డెమోక్రటిక్ పార్టీ తరపున ఇల్లినాయిస్ రాష్ట్రం నుంచి యూఎస్ హౌస్‌కు ఎంపికయ్యారు. అమెరికా కాంగ్రెస్‌కు వెళ్లబోతున్న తొలి తమిళ వ్యక్తి రాజా కృష్ణమూర్తి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు వెళ్తున్న తొలి భారత సంతతి హిందూ వ్యక్తి కూడా ఆయనే.రాజా కృష్ణమూర్తి పుట్టింది ఢిల్లీ అయినా, పేరెంట్స్‌ది మాత్రం తమిళనాడు. చిన్నవయసులో అమెరికా వెళ్లిన రాజా కృష్ణమూర్తి ఫ్యామిలీ అక్కడే స్థిరపడింది. ఆయన ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత హార్వర్డ్ లా స్కూల్ నుంచి జ్యూరిస్ డాక్టరేట్ తీసుకున్నారు.ఆయన ప్రస్తుతం శివనాథన్ ల్యాబ్స్ అండ్ ఎపిసోలార్ కంపెనీ ప్రెసిడెంట్. 2004లో ప్రస్తుతం అధ్యక్షుడు ఒబామా ప్రచార కార్యక్రమంలో పాలుపంచుకున్నాడు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







