ట్రాఫిక్ జరీమానాలు వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్లో!
- November 09, 2016
దుబాయ్ పోలీస్, ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్ - వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్ మధ్య కుదిరినొప్పందంతో, ఇకపై ట్రాఫిక్ జరీమానాల్ని వాల్‌స్ట్రీట్ ఎక్స్ఛేంజ్లో కూడా చెల్లించడానికి మార్గం సుగమం అయ్యింది. కీబిస్ అనే సంస్థ, ఈ మేరకు సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ (కీకియోస్క్స్)లను అందుబాటులోకి తెస్తోంది. యూఏఈలో పలు లొకేషన్లలో వీటిని నియమించి, వాహనదారుల నుంచి జరీమానాలు సేకరించి, దుబాయ్ పోలీసులకు అందజేస్తుంది. వాల్‌స్ట్రీట్ ఎక్స్ఛేంజ్ యాక్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సుల్తాన్ అల్ మహమౌద్, కీబిఎస్ మేనేజింగ్ డైరెక్టర్ ఇబ్రహీమ్ దర్రాజ్ మధ్య ఈ మేరకు అగ్రిమెంట్ కూడా జరిగింది. జరీమానాల చెల్లింపుకు ఇదో సులభతరమైన మార్గమనీ, వినియోగదారులు తమ సేవల్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అల్ మహమౌద్ పిలుపునిచ్చారు. టెక్నాలజీ ద్వారా మెరుగైన సేవలను అందించేందుకు ఆస్కారం ఏర్పడుతుండడం అభినందించదగ్గ విషయమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







