స్టాక్ మార్కెట్ల కు భారీ దెబ్బ...

- November 09, 2016 , by Maagulf
స్టాక్ మార్కెట్ల కు భారీ దెబ్బ...

ట్రంప్ టొర్నాడో, మోదీ క్లాంప్‌డౌన్ ఇండియన్ స్టాక్ మార్కెట్లను ఓ కుదుపు కుదిపాయి. ఈ సంచలనాత్మక చర్యలు బుధవారం మొదటి పావుగంటలో దాదాపు 6 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ పెట్టుబడులను దెబ్బ తీశాయని అంచనా. ఉదయం తమ ఇడియట్ బాక్సులను తెరచి చూసిన ఇన్వెస్టర్లు రూడ్ షాక్ తిన్నారు. బీఎస్ఈపై ట్రేడ్ అవుతున్న సుమారు 2వేలకు పైగా స్టాక్స్‌లో దాదాపు 1875 కి పైగా స్టాక్స్ రెడ్‌మార్క్ చూపగా.. 85 మాత్రం గ్రీన్‌మార్క్ చూపడం విశేషం. ఇక ఆగస్టు తర్వాత సెన్సెక్స్ భారీగా పతనమైంది. ట్రంప్ దూకుడు, పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్లను భారీగా దెబ్బ తీశాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా, నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టపోయాయి.బ్లాక్ మనీపై సర్జికల్ దాడులను ప్రకటిస్తూ మోదీ రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేయడంతో దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. అమెరికన్, ఆసియన్ మార్కెట్లు భారీగా పతనమవుతుండగా డాలర్ విలువ పడిపోయింది. ట్రంప్ ఎఫెక్టుతో బంగారం భగ్గుమంది. బులియన్ మార్కెట్ లో ఇక పసిడి ధర పైపైకి ఎగబాకవచ్చు. భారత స్టాక్ మార్కెట్ లో 24 క్యారట్ల బంగారం వెయ్యి రూపాయలు పెరిగి పది గ్రాములు రూ. 31,076 కి చేరుకుంది. మూడు శాతం వృద్ధితో 5 వారాల గరిష్ట స్థాయిని తాకింది. స్పాట్ గోల్డ్ ఒక ఔన్స్ ధర 3 శాతానికి పైగా పెరిగి 1315.84 డాలర్లుగా నమోదు కాగా..బులియన్ మార్కెట్ లో 1317.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఒక దశలో ఔన్స్ 1324.30 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకోవడం విశేషం. బ్యాంకింగ్, ఆటో షేర్లు భారీ నష్టాలను మూట గట్టుకున్నాయి. రియాల్టీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ స్టాక్స్ అతలాకుతలమయ్యాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com