డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైతే ఇండియాకు ప్రయోజనమే....!
- November 09, 2016
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కన్నా దూసుకుపోతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైతే ఇండియాకు ప్రయోజనమే కలుగుతుందని భారతీయులు భావిస్తున్నారు. ఇండియాలో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అమేజింగ్ గా ఉన్నాయని, యూఎస్ లోని ట్రెడిషనల్ పొలిటిషియన్స్ కన్నా ఈయన భిన్నంగా..భారతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నారని చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పట్ల ట్రంప్ కఠినంగా మాట్లాడడం, హిల్లరీతో పోలిస్తే ఈ విషయంపై దూకుడుగా వ్యాఖ్యానించడం గమనించదగినదని వారు అంటున్నారు. క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ఆయన బహిరంగంగా ఖండించడం విశేషమని పేర్కొంటున్నారు.
ట్రంప్ రాజకీయవేత్త కాదు.. రాజకీయంగా ఆయనకు ఎలాంటి అనుభవమూ లేదు. కానీ ఆయన ప్రసంగాలు మాత్రం ఆయన రాజకీయ పరిణతను సూచిస్తున్నాయి. ఎన్నో ప్రచార సభల్లో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఇండియాలో ఏక పన్ను విధానాన్ని ప్రవేశపెట్టిన మోదీ ఇతర దేశాలకు ఆదర్శప్రాయుడయ్యారు అని మనస్ఫూర్తిగా వ్యాఖ్యానించారు అని ఇండియాలోని వారేగాక ప్రవాస భారతీయులు కూడా పేర్కొన్నారు. కాగా హిల్లరీ అప్పుడే ఇండియాపట్ల ప్రతికూల వైఖరి అనుసరిస్తున్నారని, ఉగ్రవాదులకు తన స్వచ్చంద సంస్థ ద్వారా కోట్లాది డాలర్ల నిధుల సాయాన్ని అందజేస్తూ పరోక్షంగా భారత వ్యతిరేకవాదాన్ని పాటిస్తున్నారని వీరు అభిప్రాయపడుతున్నారు. తనను ఇస్లాం అనుకూలవాదిగా హిల్లరీ నిరూపించుకుంటున్నారని, గతంలో ఆమె పంపిన ఈ-మెయిల్స్ దీన్ని సూచిస్తున్నాయని భారతీయులు పేర్కొంటున్నారు. తాను గెలిస్తే అమెరికాలోని భారతీయులు, ముస్లిముల ప్రయోజనాలకు కృషి చేస్తానని ట్రంప్ పదేపదే హామీ ఇచ్చారు. అప్పుడప్పుడు.. ముఖ్యంగా మొదట్లో ఆయన ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడి ఉండవచ్చు.. కానీ ఆ తరువాత ఆయన ధోరణి భారత్ పట్ల అనుకూలంగా మారుతూ వచ్చింది అన్నది వీరి ఒపీనియన్.. తాజాగా ట్రంప్ గెలవాలని కోరుతూ ముంబైలో ప్రవాస భారతీయుల చొరవతో ఓ ఆలయంలో పూజారులు, పండితులు హోమాలు చేయడం విశేషం.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







