స్టాక్ మార్కెట్ల కు భారీ దెబ్బ...
- November 09, 2016
ట్రంప్ టొర్నాడో, మోదీ క్లాంప్డౌన్ ఇండియన్ స్టాక్ మార్కెట్లను ఓ కుదుపు కుదిపాయి. ఈ సంచలనాత్మక చర్యలు బుధవారం మొదటి పావుగంటలో దాదాపు 6 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ పెట్టుబడులను దెబ్బ తీశాయని అంచనా. ఉదయం తమ ఇడియట్ బాక్సులను తెరచి చూసిన ఇన్వెస్టర్లు రూడ్ షాక్ తిన్నారు. బీఎస్ఈపై ట్రేడ్ అవుతున్న సుమారు 2వేలకు పైగా స్టాక్స్‌లో దాదాపు 1875 కి పైగా స్టాక్స్ రెడ్‌మార్క్ చూపగా.. 85 మాత్రం గ్రీన్‌మార్క్ చూపడం విశేషం. ఇక ఆగస్టు తర్వాత సెన్సెక్స్ భారీగా పతనమైంది. ట్రంప్ దూకుడు, పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్లను భారీగా దెబ్బ తీశాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా, నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టపోయాయి.బ్లాక్ మనీపై సర్జికల్ దాడులను ప్రకటిస్తూ మోదీ రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేయడంతో దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. అమెరికన్, ఆసియన్ మార్కెట్లు భారీగా పతనమవుతుండగా డాలర్ విలువ పడిపోయింది. ట్రంప్ ఎఫెక్టుతో బంగారం భగ్గుమంది. బులియన్ మార్కెట్ లో ఇక పసిడి ధర పైపైకి ఎగబాకవచ్చు. భారత స్టాక్ మార్కెట్ లో 24 క్యారట్ల బంగారం వెయ్యి రూపాయలు పెరిగి పది గ్రాములు రూ. 31,076 కి చేరుకుంది. మూడు శాతం వృద్ధితో 5 వారాల గరిష్ట స్థాయిని తాకింది. స్పాట్ గోల్డ్ ఒక ఔన్స్ ధర 3 శాతానికి పైగా పెరిగి 1315.84 డాలర్లుగా నమోదు కాగా..బులియన్ మార్కెట్ లో 1317.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఒక దశలో ఔన్స్ 1324.30 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకోవడం విశేషం. బ్యాంకింగ్, ఆటో షేర్లు భారీ నష్టాలను మూట గట్టుకున్నాయి. రియాల్టీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ స్టాక్స్ అతలాకుతలమయ్యాయి
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







