మక్కాలో తెలుగువారి పరేషాన్....
- November 10, 2016
నోట్ల పాట్లు భారతదేశంలో ఉన్నవారికే కాదు విదేశాల్లో ఉన్న మన పర్యాటకులకూ తప్పడంలేదు. పాత కరెన్సీ చెల్లకపోవడంతో వారు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మక్కా పర్యటనకు వచ్చిన తెలుగు రాష్ట్రాల యాత్రికుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పెద్దపల్లి జిల్లా మొహ్మద్ జాహేద్, మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన డాక్టర్ అబ్దుల్ అజీజ్ సహా కొన్ని వందల మంది మక్కాలో ఉన్నారు. వీరందరి దగ్గర పాత 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. వాటిని స్వీకరించడానికి స్థానిక మనీ ఎక్సేంజిలు నిరాకరిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.వీరిని తీసుకోవచ్చిన టూర్ ఆపరేటర్లు కూడా నోట్ల మార్పిడికి నిరాకరిస్తున్నారు. భారతీయ కరెన్సీ నోట్లను మార్పిడి చేయడానికి తమకు అధికారం లేదని దుబాయిలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ వి.దుర్గా ప్రసాద్ చెప్పారు
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









