నేడు జపాన్ ప్రధాని ఆబెతో మోదీ చర్చలు...
- November 10, 2016
ప్రధాని నరేంద్ర మోదీ తన జపాన్ పర్యటనలో భాగంగా గురువారం టోక్యో చేరుకున్నారు. జపాన్ రాజధానిలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. శుక్ర, శనివారాలలో జపాన్ ప్రధాని షింజో ఆబె, చక్రవర్తి అకిహిటో, జపాన్ వాణిజ్య కంపెనీల అధిపతులతో విడివిడిగా చర్చలు జరపనున్నారు. జపాన్‌తో 12 ద్వైపాక్షిక ఒప్పందాలతోపాటు, కీలకమైన పౌర అణుఒప్పందంపై భారత్ సంతకాలు చేసే అవకాశం ఉంది. భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్య అభివృద్ధి, మౌలిక సౌకర్యాల అభివృద్ధి తదితర రంగాలలో సహకారాన్ని విస్తృతం చేసుకోవడంపై శుక్రవారం ఆబెతో చర్చలు జరుపుతారు.
కాగా, మోదీ టోక్యో వెళుతూ గురువారం మార్గమధ్యంలో థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఆకస్మికంగా ఆగారు. గత నెలలో కనుమూసిన థాయ్ చక్రవర్తి భూమిబోల్ అదుల్యదేజ్‌కు ఘనంగా నివాళులర్పించారు
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







