భారత కరెన్సీ మార్పిడి - మీరేం చెయ్యాలి?

- November 11, 2016 , by Maagulf
భారత కరెన్సీ మార్పిడి - మీరేం చెయ్యాలి?

భారత ప్రధాని నరేంద్రమోడీ 500 మరియు 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కొత్త నోట్ల వినియోగంపై ప్రకటన చేసిన వెంటనే భారతదేశంలోనివారే కాకుండా, విదేశాల్లోనివారు కూడా షాక్‌కి గురయ్యారు. అయితే ఆర్‌బిఐ పాత నోట్ల మార్పిడికి కొంత వెసులుబాటు కల్పించింది. ఇది విదేశాల్లోని భారతీయులకూ వర్తిస్తుంది. విదేశాల్లోని భారతీయ బ్యాంకులు రద్దు చేయబడిన పాత నోట్లను స్వీకరించాల్సి ఉంటుంది ఆర్‌బిఐ గైడ్‌ డైన్స్‌ ప్రకారం. కాబట్టి ఆ పాత నోట్లు ఉన్నవారు భారతీయ బ్యాంకులకు వెళ్ళి మార్చుకుంటే సరిపోతుంది. డిసెంబర్‌ 30 లోపు ఇండియా వెళ్ళాలనుకుంటే సమస్యే లేదు, వెళ్ళిన తర్వాత వాటిని మార్చుకోవచ్చు. మీరు వెళ్ళని పక్షంలో మీ స్నేహితులకు మీ వద్ద ఉన్న పాత నోట్లను ఇచ్చి వారు ఇండియాకి వెళితే మార్పించుకోవచ్చు. డిసెంబర్‌ 30 తర్వాత గనుక మీరు ఇండియాకి వెళితే ఆర్‌బిఐలో పాత నోట్లను మార్చుకునే అవకాశం కూడా ఉంది. డిపాజిట్‌ చేయడానికి పరిమితుల్లేవుగానీ, నోట్లను మార్చుకోడానికి మాత్రం కేవలం 4 వేల వరకే అనుమతినిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com