గేమింగ్ రంగానికి హబ్‌గా హైదరాబాద్
- November 11, 2016
గేమింగ్ రంగానికి హైదరాబాద్ అతి పెద్ద హబ్‌గా మారనుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గేమింగ్, మల్టీమీడియా రంగానికి తమ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తోందన్నారు. హెచ్ఐసీసీలో నాస్కాం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నాస్కాం గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్-2016ను ఆయన ప్రారంభించారు. వందకు పైగా పేరున్న గేమింగ్ సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిపారు. బాహుబలి, మగధీర, ఈగ, లైఫ్ ఆఫ్ పై లాంటి విజువల్ ఎఫెక్ట్స్ చిత్రాల నిర్మాణం హైదరాబాద్‌లోనే జరిగిందన్నారు. త్వరలో టీహబ్ రెండో దశ భవనాన్ని నిర్మిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. అనంతరం భారత్‌లో నెదర్లాండ్స్ రాయబారి మాట్లాడుతూ.. భారత్‌లో గేమింగ్ రంగానికి చక్కని భవిష్యత్తు ఉందన్నారు. ఈ రంగంలో మరింత పురోగతి కోసం భారత్ కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాస్కాం ఛైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఎన్జీడీసీ ఛైర్మన్ రాజేశ్రావు, దేశ విదేశాల నుంచి వచ్చిన గేమ్ డెవలపర్లు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్







