'పిజ్జా 2' సినిమా ట్రైలర్‌ విడుదల

- November 11, 2016 , by Maagulf
'పిజ్జా 2' సినిమా ట్రైలర్‌ విడుదల

తమిళ ప్రముఖ హీరో విజయ్‌ సేతుపతి నటిస్తున్న 'పిజ్జా 2' చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. తమిళంలో 'పురియత్‌ పుధీర్‌' టైటిల్‌తో విడుదల చేస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో డీవీ సినీ క్రియేషన్స్‌ అధినేత డి. వెంకటేశ్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర తమిళ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. రంజిత్‌ జయకోడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గాయత్రి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శామ్‌ సిఎస్‌, సినిమాటోగ్రఫీ: దినేష్‌ క్రిష్ణన్‌, ఎడిటర్‌: భావన శ్రీకుమార్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com