జపాన్ లో బుల్లెట్ రైలెక్కిన మోదీ
- November 11, 2016
జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి బుల్లెట్ రైల్లో ప్రయాణించారు. జపాన్‌లోని ప్రఖ్యాత హైస్పీడ్ బుల్లెట్ రైలు షింకన్‌సేన్‌లో టోక్యో నుంచి ఒసాకా తీరంలోని కోబ్ నగరం వరకు ప్రయాణించారు. అబేతో కలిసి బుల్లెట్ రైల్లో ప్రయాణిస్తున్న ఫొటోను మోదీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. షింకన్‌సేన్ బుల్లెట్ రైలు టెక్నాలజీతో భారత్‌లో ముంబయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు.
ఈ రైలు గంటకు 240కిలోమీటర్ల నుంచి 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇరు దేశాల ప్రధానులు రైలు ప్రయాణంలో వివిధ అంశాలపై చర్చించారు.షింకన్‌సేన్‌లో మోదీ, అబేల ప్రయాణం గురించి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి వికాస్ స్వరూప్ కూడా ట్విట్టర్‌లో ఫొటోలు పోస్ట్ చేశారు. మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జపాన్, భారత్ మధ్య చరిత్రాత్మక పౌర అణు ఒప్పందం కుదరింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







