వాటర్‌ కెనాల్‌ రైడ్‌ తొలి అనుభవం అదుర్స్‌

- November 11, 2016 , by Maagulf
వాటర్‌ కెనాల్‌ రైడ్‌ తొలి అనుభవం అదుర్స్‌

దుబాయ్‌: దుబాయ్‌ వాటర్‌ కెనాల్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన క్రూయిజ్‌ రైడ్‌ అద్భుతంగా ఉందంటూ తొలిసారిగా ప్రయాణించిన ప్రయాణీకులు తమ అనుభవాల్ని పంచుకుంటున్నారు. డెక్‌ మీదకు వెళ్ళి దుబాయ్‌ కెనాల్‌ చుట్టూ ఉన్న అందాల్ని తమ స్మార్ట్‌ ఫోన్లలోనూ, కెమెరాల్లోనూ బంధించారు. ఈ తొలి అనుభవం ఎంతో ప్రత్యేకమైనదిగా సౌదీ నేషనల్‌ మహెర్‌ ఖాదెర్‌ చెప్పారు. రైడ్‌లో ప్రతిక్షణాన్నీ ఎంజాయ్‌ చేసినట్లు మరో రైడర్‌ ఎర్మిన్‌ బోలెసిక్‌ చెప్పారు. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి దుబాయ్‌ని విజిట్‌ చేశారు. డెన్మార్క్‌ నుంచి ఆయన దుబాయ్‌ వచ్చారు. పాలస్తీనాకి చెందిన సమెర్‌ రాడి మాట్లాడుతూ, పిల్లలు ఈ రైడ్‌ని బాగా ఎంజాయ్‌ చేసినట్లు వెల్లడించారు. పర్యాటకంలో ఇదొక కొత్త అనుభవం అని ఇండియాకి చెందిన సుఫియాన్‌ ఘన్‌సార్‌ అన్నారు. అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌తో సెల్ఫీల కోసం బోట్‌లో ప్రతి ఒక్కరూ పోటీ పడినట్లు ఆయన వివరించారు. తొలి రోజు తొలి రైడ్‌లో 37 మంది ప్రయాణీకులు ప్రయాణించి అద్భుతమైన అనుభూతికి లోనయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com