రాస్ అల్ ఖైమా ఎయిర్ పోర్ట్ లో భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం

- November 13, 2016 , by Maagulf
రాస్ అల్ ఖైమా ఎయిర్ పోర్ట్ లో భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం

రాస్ అల్ ఖైమాహ్:  ఓ స్మగ్లర్ తన పొట్టనే అక్రమ రవాణాకు అడ్డాగా మార్చుకున్నాడు. కానీ ఆ నిందితుడి ప్రణాళిక బెడిసికొట్టింది.పాకిస్తాన్ దేశానికి చెందిన ఆ వ్యక్తి తన కడుపు లోపల 198 హెరాయిన్ గుళికలను దాచి అక్రమ స్మగ్లింగ్ కు ప్రయత్నించి   రాస్ అల్ ఖైమాహ్ పోలీసులకు దొరికిపోయాడు. రాస్ అల్ ఖైమాహ్ పోలీస్ యాంటీ నార్కోటిక్స్ విభాగ డైరెక్టర్ జనరల్, కల్నల్ అద్నాన్ ఆలీ అల్ జాబి ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాకిస్థాన్ నుంచి సందర్శన వీసాతో రాస్ అల్ ఖైమాహ్ విమానాశ్రయంకు చేరుకొన్న అనుమానిత వ్యక్తి  మాదకద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్నట్లు అనుమానించి అతని కదలికలు గురించి తెలుసుకొనేందుకు ఒక జట్టును ఏర్పాటు చేశారు. నిందితుని  వింత ప్రవర్తనను బట్టి మరింత అనుమానం బలపడిన నేపథ్యంలో పోలీసులు నిందితుని అరెస్ట్ చేశారు. ఈ నిందితుడిని పట్టుకోవడంతో కొంతమంది ప్రయాణీకులు  భయపడినట్లు కనిపించింది. పోలీసుల విచారణలో తన కడుపులో మాదక ద్రవ్యాల మాత్రలు దాచి ఉంచినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. దీనితో నిందితుడిని ఆస్పత్రికి తరలించగా,   1 మిలియన్ డి హెచ్ విలువ చేసే 198  హెరాయిన్  మాదక ద్రవ్య గుళికలు ఆ వ్యక్తి  కడుపు లోపల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కల్ అల్ జాబి ఈ నేరస్థుని గురించి వివరిస్తూ, మాధకద్రవ్యాల మాత్రలను కడుపు దాచిపెట్టడం ద్వారా అక్రమ రవాణా ఎంతో ప్రమాదకరం అని పేర్కొంటూ, వీటిని రవాణా చేసే వ్యక్తి మరణించే అవకాశం సైతం ఉందనన్నారు. కమాండర్-ఇన్-చీఫ్ రాస్ అల్ ఖైమాహ్ పోలీస్ మేజర్ జనరల్ ఆలీ ఆళ్వాన్  అల్ నురిమి మాట్లాడుతూ నేరస్థుని పట్టుకోవడంలో దేశంలో పోలీసు విభాగాలు కనబర్చిన సహకారం గూర్చికొనియాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com