ఈనెల 25న విడుదల కానున్న 'చిన్నారి'
- November 13, 2016
ప్రముఖ సౌత్ ఇండియన్ స్టార్ ఉపేంద్ర సతీమణి ప్రియాంక కీలక పాత్రలో నటించిన చిత్రం `చిన్నారి`. బేబి యులీనా పార్థవి, ఐశ్వర్య, మధుసూదన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కె.ఆర్.కె. ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె. రవికుమార్, ఎం.ఎం.ఆర్ నిర్మాతలు. తెలుగు, కన్నడలో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. లోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ `` నాకు దర్శకుడిగా తొలి చిత్రమిది. హారర్ జోనర్లో చాలా డిఫరెంట్‌గా ట్రై చేశాం. తల్లీకూతురు సెంటిమెంట్ కూడా ఉంటుంది. సినిమా మొత్తం పూర్తయింది. ఇటీవల విడుదలైన టీజర్ గ్రిప్పింగ్‌గా, స్టైలిష్‌గా ఉందని చాలా మంది చెబుతున్నారు. వేణు కెమెరా పనితనం, రవిచంద్రకుమార్ ఎడిటింగ్ మెప్పిస్తాయి. అజినీష్ లోక్‌నాథ్ మంచి సంగీతం చేశారు`` అని చెప్పారు.
నిర్మాతలు మాట్లాడుతూ ``హారర్ చిత్రమిది. చైల్డ్ సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఉంటుంది. గోవా నేపథ్యంలో కథ జరుగుతుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. `రంగి తరంగి`కి సంగీతం చేసిన అజినీష్ లోక్‌నాథ్ చక్కటి బాణీలను ఇచ్చారు. కన్నడలో టాప్ కెమెరామెన్ వేణు ఫోటోగ్రఫీ చేశారు. హాలీవుడ్ స్టైల్ టేకింగ్, ఆర్ .ఆర్ మెప్పిస్తాయి. ఈ నెల 25న సినిమాను విడుదల చేస్తాం`` అని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్‌లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







