వదలివేయబడిన కార్ల విషయమై నగరంలో మళ్ళీ ఉద్యమ పునరుద్ధరణ

- November 14, 2016 , by Maagulf
వదలివేయబడిన కార్ల విషయమై నగరంలో మళ్ళీ ఉద్యమ పునరుద్ధరణ

మస్కట్ : నగరంలో వివిధ ప్రాంతాలలో వదలివేయబడి పాడై పోయిన కార్ల కారణంగా ఆరోగ్య ప్రమాదాలు తలెత్తుతున్నాయని వీటిని క్రమబద్ధీకరించేందుకు మస్కట్ లో అస్తవ్యస్త పార్కింగ్ తప్పించేందుకు  హెల్త్ మస్కట్ మున్సిపాలిటీ యొక్క ఆరోగ్య డైరక్టరేట్ ఆ నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలకు స్టిక్కర్లను అతికించాలని ఒక కార్యక్రమంను తిరిగి ప్రారంభించింది. కార్లను వదిలివేసిన యజమానులు స్టికర్లను అతికించిన తర్వాత  వారు తమ వాహన సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే, వివిధ ప్రాంతాలలోవదిలివేసిన వారి కార్లను స్వాధీనం చేసుకొని వాటిని దూరంగా తరలిస్తామని సలహా ఇచ్చారు. మస్కట్ మున్సిపాలిటీలో ఒక ఉన్నతాధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో మాదిరిగా కాక ,ఈ సమస్యకు  మేము ఒక పరిష్కారం కనుగొనేందుకు రాయల్ ఒమాన్ పోలీసుల సహకారం తీసుకొంటున్నట్లు పేర్కొన్నారు. స్టికర్లను అతికించిన తర్వాత వాటి యజమానులు మూడు రోజుల్లో కనుక వాటిని తీసుకొనివెళ్ళకపోతే , వారి వాహనాలను పారవేసేందుకు వెనకాడబోమని జరిమానాలు చెల్లించి ఆయా వాహనాలను అక్కడ్నించి తీసుకుపోవాలని ఆయన  సూచించారు. యజమానులు స్పందించని పక్షంలో కాల పరిమితి ముగిసిన తర్వాత  వదిలివేయబడిన  కార్లను నేరుగా ఒక యార్డుకు పంపడం జరుగుతుంది. అప్పటికీ యజమానులు తమ తమ వాహనాల విషయమై అధికారులను సంప్రదించకాపోతే, ఆయా కార్లు వేలం వేయబడతాయని ఆ అధికారి తెలిపారు.ఇది 5 వ అధికరణం కింద స్థానిక ఆర్డినెన్స్ సంఖ్య 1/2006 ప్రకారం ప్రజా ఆరోగ్య పరిరక్షణ కింద ప్రభుత్వం ఈ చర్యలను ప్రకటించారు, పురపాలక శాఖ దీనిపై బాధ్యతలు తీసుకుంది అన్నిశుభ్రత చర్యలు చేపట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com