ఉదయం
- November 14, 2016
విరిగిన కెరటాన్ని చూసి
వెర్రిగా నవ్వుకున్నావు
కురిసే మేఘాన్ని పిలిచి
కసిగా తరిమి కొట్టావు
ఇన్నాళ్ళు
దారికాని దారుల వెంట
నిన్నెందుకు పారేసుకున్నావో
దహించే గాయానికి
ఒక్కసారైనా కరిగిపో
ద్రవించే దుఃఖాన్ని
ఎంతో కొంత వొంపుకో
మనసుకు తడి తెలిసాక
మట్టికి నీళ్ళ తడి దొరకదా
కొత్తగా మొలకెత్తడమంటే
నువ్వు నాలో
నేను నీలో
ఇంకి పోవడమే
పారువెల్ల
తాజా వార్తలు
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్‌లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్‌మూన్..!!







