కుంకుడు కాయ అనేక రకాలైన రోగాల్ని నయం చేస్తుంది..
- November 16, 2016
ప్రస్తుతం షాంపులు వచ్చాయి. కానీ ఒకప్పుడు ప్రతి ఇంట్లో కుంకుడు కాయ పులుసుతోనే తలంటుకునే వారు. కుంకుడు కేవలం తలంటు కునేందుకే కాక అద్భుతమైన ఆయుర్వేద విలువలను కలిగి ఉన్నది. అనేక రకాలైన రోగాల్ని నయం చేస్తుంది. నేటికీ పెద్ద వయస్సు ఉన్న వారు ఇళ్లలో ఉంటే వారు కుంకుడు కాయతోనే తలంటుకుంటాడు. పిల్లలైతే కుంకుడు కాయ అంటే ఆమడదూరం పరుగెడతారు. చేదుగా ఉండే కుంకుడు కాయరసం కంట్లో పడిందా ఒళ్ళు తెరవనీయక మంట పుట్టిస్తుంది. అందుకే పిల్లలు దీనికి దూరంగా ఉంటారు.
కుంకుడు కాయ చేదుగా ఉంటుంది. దీని రసం నురగతో ఉంటుంది. ఇది క్రిమి సంహారిణిగా ఉపయోగపడుతుంది. కుంకుడు కాయలో ఉండే గింజను బద్దలుకొడితే పప్పు ఉంటుంది. ఇది ఉబ్బసాన్ని నివారించడంలో తోడ్పడుతుంది. హిస్టీరియా వ్యాధిలో కుంకుడు కాయ పొగను వేసి ఆ పొగను వాసన పీల్చేలా చేస్తే వారు సృహలోకి వస్తారు. హిస్టీరియా రోగికి చితక కొట్టిన కుకుండు కాయను నీటితో పిసికి ఆ రసాన్ని రోగి ముక్కు రంధ్రాలలో ఒకటి లేక రెండేసి చుక్కలు వేస్తే వెంటనే సృహలోకి వస్తారు.కుంకుడు కాయ రసంతతో తలంటు కుంటుంటే చుండ్రు తగ్గి పోతుంది. కురుపులను కుంకుడు కాయ రసంతో కడుగుతూ ఉంటే త్వరగా తగ్గిపోతాయి. చిడుము వ్యాధిలో కుంకుడు అద్భుతంగా పనిచేస్తుంది. తామర వ్యాధిలో ముందుగా తామర వ్యాధి ఉన్న ప్రాంతంలో కుంకుడు కాయరసంతో శుభ్రం చేసి ఆ తర్వాత జిల్లేడు పాలు రాయాలి. తేలు, జెర్రి కాటులకు కుంకుడు కాయ గుజ్జును ఆ ప్రాంతంలో వ్రాయాలి. బాధపోయేదాకా రుద్దాలి. కుంకుడు కాయల చిక్కటి రసం ఒక్కో ముక్కులో రెండు చుక్కలు వేస్తే ఎంతటి తలనొప్పి అయినా వెంటనే తగ్గిపోతుంది. కుంకుడు ఆకులను తలకు కట్టినా దారుణమైన తలనొప్పి కూడా తగ్గుతుంది. దురదులకు కుంకుడు కాయ రసంతో స్నానం చేయాలి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







