నిర్మాతగా ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్న చెర్రీ ...
- November 17, 2016
మెగాస్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో రామ్ చరణ్. ఇప్పటికే హీరోగా సత్తా చాటిన చెర్రీ ప్రస్తుతం నిర్మాతగానూ ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. తొలిసారిగా నిర్మాతగా మారడానికి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమానే కరెక్ట్ అని భావించాడు. అందుకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150ని తను సొంతంగా స్థాపించిన కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి నిర్మిస్తున్నాడు.తండ్రి సినిమాతో నిర్మాతగా మారిన చెర్రీ, ఫ్యూచర్ లోనూ తన బ్యానర్ క్రేజీ ప్రాజెక్ట్స్ ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఓ క్లారిటీకి వచ్చాడన్న టాక్ వినిపిస్తోంది.చిరు సినిమా పూర్తవ్వగానే తన చిన్ననాటి మిత్రుడు శర్వానంద్ హీరోగా ఒక సినిమా, అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా మరో సినిమాను ప్రారంభించే ప్లాన్ ఉన్నాడట. మెగాస్టార్ వారసుడిగా నటుడిగా కొనసాగుతూనే నిర్మాతగానూ ప్రూవ్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాడు చరణ్.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







