బహ్రెయిన్‌లో ఎల్‌ఐసి ఇంటర్నేషనల్‌ దూకుడు

- November 18, 2016 , by Maagulf
బహ్రెయిన్‌లో ఎల్‌ఐసి ఇంటర్నేషనల్‌ దూకుడు

ఎల్‌ఐసి ఇంటర్నేషనల్‌, వార్షిక టార్గెట్‌లో మంచి పెరుగుదలను చవిచూసినట్లు వెల్లడించింది. నాన్‌ సింగిల్‌ ప్రీమియమ్‌లో 112 శాతం, సింగిల్‌ ప్రీమియమ్‌లో 105 శాతం, టోటల్‌ ఫస్ట్‌ ప్రీమియమ్‌ ఇంకమ్‌లో 105 శాతం టార్గెట్‌ని చేరుకున్నట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. 31 అక్టోబర్‌ 2016 నాటి గణాంకాల్ని సంస్థ వివరించింది. నంబర్‌ ఆఫ్‌ పాలసీస్‌ టార్గెట్ణఇ కూడా అనుకున్నదానికన్నా ముందే చేరుకున్నట్లు తెలిపారు సంస్థ ప్రతినిథులు. ఎల్‌ఐసి ఇంటర్నేషనల& బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ మీటింగ్‌ హోటల్‌ మోవెన్‌పింక్‌లో జరిగింది. ఎల్‌ఐసి ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ వికె శర్మ, ఇంటర్‌కోల్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ అలి అజ్వాన్‌, ఎల్‌ఐసి ఇంటర్నేషనల్‌ బహ్రెయిన్‌ సిఇఓ మరియు ఎండి రాజేష్‌ కండ్వాల్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఎ.ఎం.బెస్ట్‌, తమ సంస్థకు బి ప్లస్‌ ప్లస్‌ (గుడ్‌) రేటింగ్‌ని గత ఏడాదిలానే ఇచ్చిందని సంస్థ వెల్లడించింది. వివిధ యూనిట్లకు చెందిన 10 మంది కన్సల్టెంట్లను ఈ సందర్బంగా వికె శర్మ ఘనంగా సత్కరించారు. కెకె ప్రవీణ్‌ - దుబాయ్‌ (బహ్రెయిన్‌), సందేష్‌ కిట్లెకర్‌, అనంతరామన్‌, టివి ప్రేమ్‌కుమార్‌ హారిస్‌, మోఫిజుద్దిన్‌ ఖాన్‌, కిరణ్‌ జైన్‌, బైజు బాలన్‌ (దుబాయ్‌), ఆర్‌.శ్రీనివాసరావు, కెసి సురేంద్రన్‌ (ఖతార్‌) తదితరులు సన్మానం పొందినవారిలో ఉన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com