చైనా ఓపెన్ టోర్నీలో సెమీస్‌లోకి సింధు...
- November 18, 2016
కెరీర్‌లో లోటుగా ఉన్న సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో అడుగు ముందుకేసింది. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ అమ్మారుు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 22-20, 21-10తో హీ బింగ్‌జియావో (చైనా)పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో నాలుగు టైటిల్స్ (బిట్ బర్గర్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, జపాన్ ఓపెన్, స్విస్ ఓపెన్) సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హీ బింగ్‌జియావో నుంచి సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీనే ఎదురైంది.
ఒకదశలో 1-5తో, 14-17తో వెనుకబడిన సింధు నెమ్మదిగా తేరుకొని తుదకు 20-20తో స్కోరును సమం చేసింది.
అదే జోరులో వరుసగా రెండు పారుుంట్లు నెగ్గి 21 నిమిషాల్లో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం సింధు పూర్తి ఆధిపత్యం చలారుుంచింది. ఆరంభంలో 7-3తో ముందంజలో ఉన్న సింధు ఆ తర్వాత నిలకడగా పారుుంట్లు సాధించి 14-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సింధు వెనుదిరిగి చూడకుండా విజయాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 5-3తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో అజయ్ జయరామ్ పోరాటం ముగిసింది. ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో జయరామ్ 15-21, 14-21తో ఓడిపోయాడు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







