ఉల్ఫా ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు

- November 19, 2016 , by Maagulf
ఉల్ఫా ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు

అసోంలో ఉల్ఫా ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. టిన్‌సుకియా జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఆర్మీ జవాన్ల వాహనం లక్ష్యంగా ఐఈడీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. కాగా పెంగ్రీ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ అధికారి సునీత్‌ న్యూటన్‌ తెలిపారు.ఉగ్రవాదులు ముందుగా పేలుడుకు పాల్పడి అనంతరం జవాన్లపై కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. గాయపడిన జవాన‍్లను చికిత్స ని​మిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ చర్యను అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ తీవ్రంగా ఖండించారు. అధికారులను టిన్‌సుకియా పంపిస్తున్నట్లు వెల్లడించారు.మరోవైపు ఈ సంఘటనపై ఆర్మీ ఈస్ట్రన్‌ కమాండ్‌ కూడా ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com