ట్రాఫిక్ అవేర్‌నెస్‌లో ఇన్సూరెన్స్ కంపెనీల వైఫల్యం
- November 19, 2016
ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్, డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ సాద్ అల్ ఖర్జి, ట్రాఫిక్ అవేర్‌నెస్ పెంచడంలో ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమాత్రం శ్రద్ధ పెట్టడంలేదని ఆక్షేపించారు. ఈ విభాగంలో ఇన్సూరెన్స్ కంపెనీల పాత్ర కీలకం అయినా, వారు చూపుతున్న శ్రద్ధ చాలా చాలా తక్కువగా ఉందని అన్నారాయన. ఇన్సూరెన్స్ కంపెనీలు, పలు రకాలైన ఆలోచనలతో ట్రాఫిక్ అవేర్‌నెస్‌ని పెంచే చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రమాదాల్ని తగ్గించేందుకు ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ తీసుకుంటున్న చర్యల్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ప్రచారం చేయాల్సి ఉందని చెప్పారు. రోడ్లపై భద్రత విషయంలో ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు సంయుక్తంగా కలసి పనిచేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో డాక్యుమెంటేషన్స్, క్లియరెన్స్‌లు త్వరితగతిన చేయవలసి ఉంటుందన్న ఆయన ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అయినప్పటికీ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి తగిన స్థాయిలో మద్దతు రావడంలేదని అన్నారాయన. వాహనదారుల కోసం ఖతార్ ఇస్లామిక్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఖతార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, జనరల్ తకాఫుల్ కంపెనీ, ఖతార్ ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయాల్ని డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఏర్పాటు చేసిందని తెలియజేశారు అల్ ఖర్జి.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







