మోదీతో కెసిఆర్ భేటీ
- November 19, 2016
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఢిల్లీవెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ భేటీలో పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులను మోదీకి సీఎం వివరించినట్టు తెలుస్తోంది. పాత పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ర్టానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందిగా కూడా కెసిఆర్ ప్రధానిని కోరినట్లు సమాచారం.
కేంద్రానికి చెల్లించాల్సిన పన్నుల్లో మారటోరియం విధించి వెసులుబాటు కల్పించాలని.. గృహిణులు దాచుకున్న మొత్తాన్ని నల్లధనంగా పరిగణించవద్దని కూడా సిఎం సూచించనట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా రూ. 500 నోట్లు అందుబాటులోకి తీసుకురావాలని.. గ్రామాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా పెద్ద నోట్ల మార్పిడి కొనసాగించాలని, ప్రైవేటు హాస్పిటల్స్ లోనూ పాతనోట్లు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని మోదీకి కెసిఆర్ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







