మంచినీటితో తలనొప్పికి చెక్
- November 19, 2016
తలనొప్పికి చెక్ పెట్టాలంటే.. నీరెక్కువ తాగండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. స్త్రీలు పనుల్లో పడిపోయి దీని గురించి అంతగా పట్టించుకోరు. ఒంట్లో ఏమాత్రం నీటి శాతం తగ్గినా (డీహైడ్రేషన్) మూడ్ మారిపోవటానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తేలికపాటి వ్యాయామాలు చేసినా, కంప్యూటర్ ముందు పనిచేస్తున్నా సరే.. మహిళలు ఎక్కువగా అలసటకు గురవుతుంటారని.. అలాంటి వారు నీరు ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఒంట్లో నీరు తగ్గినపుడు వీరిలో మానసిక సామర్థ్యంలో ఎలాంటి తేడా కనిపించలేదు గానీ ఏకాగ్రత మాత్రం గణనీయంగా తగ్గిపోయింది. లక్ష్యాలను గుర్తించే పరీక్షలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడ్ మారిపోయి ఉత్సాహం తగ్గిపోవటం, అలసట పెరిగిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటప్పుడు నిజానికి మనకు దాహం వేసే సమయానికే ఒంట్లో నీటిశాతం తగ్గిపోయి ఉంటుందని గుర్తించాలి.
తలనొప్పి, అలసట ఉన్నాయంటే మరింత ఎక్కవ నీళ్లు తాగాలి. కాబట్టి నిరంతరం పనుల్లో మునిగిపోయే స్త్రీలు, వ్యాయామాలు చేసే మహిళలు తరచుగా నీళ్లు తాగటం మేలు. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







