బాలీవుడ్ బాద్ షా కు తృటిలో తప్పిన ప్రమాదం
- November 19, 2016
బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుక్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. షారుక్.. ప్రస్తుతం గౌరీ షిండే దర్శకత్వం వహిస్తున్న 'డియర్ జిందగీ' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో షారుక్‌కి జంటగా ఆలియా భట్ నటిస్తోంది. సినిమాలో షారుక్, ఆలియాలు సైకిల్‌పై గల్లీ రోడ్డులో చక్కర్లు కొట్టాల్సిన సన్నివేశం ఉంటుంది. ఇందుకోసం కావాల్సిన సామాన్లతో పాటు చిత్రబృందం అంతా కలిసి ఆప్రదేశానికి ఓ టెంపోలో వచ్చారు. టెంపో ఆగిన చోటే షారుక్ సైకిల్ పక్కన నిల్చున్నాడు. అయితే టెంపో డ్రైవర్ చూసుకోకుండా బండి స్టార్ట్ చేయడంతో అది సైకిల్‌పైకి దూసుకెళ్లింది.
వెంటనే గమనించిన షారుక్ పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం దర్శకురాలు గౌరి, కెమెరామెన్ సైకిల్ సన్నివేశాన్ని గబగబా చిత్రీకరించినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







