టూత్ పేస్ట్ ఎలాంటిది వాడుతున్నారో చెక్ చేసుకోండి!
- November 20, 2016
నవ్వుకు దంతాలు మరింత అందాన్నిస్తాయి. దంతాల పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలం. దేశంలోని ప్రజలు దాదాపు 51 శాతం మాత్రమే టూత్ పేస్టు, టూత్ బ్రష్‌ను వాడుతున్నారంటే నమ్మబుద్ధి కావట్లేదు కదూ... అందునా భారతదేశంలో నివసించే ప్రజల్లో దంత సమస్యలపై లేదా దంతాలను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకోలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం దంతాలపై అవగాహన లేకపోవడమేనంటున్నారు వైద్యులు.
దేశంలోని కేవలం 19 శాతం మంది ప్రజలు మాత్రమే ఉదయం, రాత్రి రెండు పూటలా దంతావధానం చేస్తున్నట్లు ఓ సర్వేలో తెలిసింది. అలగే పంటి నొప్పి కలిగినప్పుడు దేశంలోని 82 శాతం మంది ప్రజలు వైద్యుల వద్దకు వెళ్ళి చికిత్స చేసుకునేందుకు వెనుకాడుతున్నారు. అదే నూరు మందిలో కేవలం ముగ్గురు మాత్రమే నిత్యం ప్రతి ఏడాదికి ఒకసారి తమ దంత పరీక్షల కొరకు వైద్యుల వద్దకు వెళుతుంటారని ఆ సర్వే ఫలితాలు వెలువరించింది.
టూత్ పౌడర్ లేదా టూత్ పేస్ట్
దంతావధానం చేసేందుకు టూత్ పౌడర్ లేదా టూత్ పేస్ట్ ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి మాత్రమే ఎంచుకోవాలి. ఎందుకంటే వీటిలో ఏదో ఒకదానితోనే బ్రష్ చేయగలుగుతారు. దీంతో దంతావధానం సరిగా చేయగలుగుతారు. ఒకవేళ మీరు టూత్ పౌడర్‌ను వినియోగించాలనుకుంటే ఆ పౌడర్ నున్నగా ఉండేలా చూసుకోండి.
మీరు వాడే టూత్ పేస్ట్ ఎలా ఉండాలంటే...
* ఏదైనా మంచి కంపెనీ లేదా మంచి బ్రాండ్ కలిగిన టూత్ పేస్ట్‌ను ఉపయోగించండి.
* టూత్ పేస్ట రంగు, రుచి, సువాసనకు బదులుగా దాని పనితనమెంతో తెలుసుకోండి.
* ఆహారం లేదా నీరు తీసుకునే సమయంలో మీ దంతాలకు చల్లగా-వేడిగా అనిపిస్తే మెడికేటెడ్ టూత్‌పేస్ట్‌ను ఉపయోగించండి.
* ఎక్కువ వైటనర్స్ కలిగిన టూత్ పేస్ట్‌ను ఎక్కువకాలంపాటు వాడటం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు దంతవైద్య నిపుణులు.
* ఫ్లోరైడ్‌తో కూడుకున్న టూత్ పేస్ట్‌ను వాడదలచుకుంటే వైద్యుల సలహా మేరకు వాడండి.
* చిన్నపిల్లలకు ఫ్లోరైడ్‌తో కూడుకున్న టూత్ పేస్ట్ ఇవ్వకండి.
* ఎట్టి పరిస్థితుల్లోను ఏ రకానికి చెందిన టూత్ పేస్ట్‌ను మింగకండి.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







