దుబాయ్‌లో 'యోగా ఫెస్ట్‌ మి'

నవంబర్‌ 18 - 19 తేదీల్లో అంగరంగ వైభవంగా యోగా ఫెస్టివల్‌ జరిగింది. గల్ఫ్‌ రీయిజన్‌కి సంబంధించి పలు దేశాలకు చెందిన యోగా ఇన్‌స్ట్రక్టర్స్‌ యోగి, యోగినిలు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. దుబాయ్‌ ఇంటర్నెట్‌ సిటీ, యాంఫీ థియేటర్‌ ఇందుకు వేదికయ్యింది. యోగా, పైలేట్స్‌, డాన్స్‌ కి గోంగ్‌, మెడిటేషన్‌ వంటివి ఈ కార్యక్రమంలో హైలైట్‌గా నిలిచాయి. సుమారు 5000 మంది యోగి, యోగినిలు ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు. మహిళల కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇది వరుసగా 6వ సంవత్సరమనీ, ఈ తాజా ఈవెంట్‌లో 30 స్పాన్సరర్స్‌ తమకు సహకరించారని, రెండ్రోజుల్లో సుమారుగా 150 క్లాసులు నిర్వహఙంచగలిగామని ఫెస్టివల్‌ ఫౌండర్‌, యోగిని, ఎలైన్‌ కెల్లీ చెప్పారు. 

Back to Top