కాబుల్ మసీదులో ఆత్మాహుతి దాడి, డజన్ పైగా మృతి

కాబుల్ మసీదులో ఆత్మాహుతి దాడి, డజన్ పైగా మృతి

ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ మరో మారు రక్తసిక్తమైంది. ఓ షియా మసీదు వెలుపల ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 13 మంది అక్కడిక్కడే మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. బాంబు పేలుడుతో మసీదు పరిసర ప్రాంతం దద్దరిల్లింది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయంతో పరుగులు తీశారు. మృతి చెందిన వారి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మసీదు రక్తసిక్తమైంది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Back to Top