వ్యాయామ సమయంలో ఎక్కువయ్యే ఆస్తమాకు చికిత్సలు

- November 21, 2016 , by Maagulf
వ్యాయామ సమయంలో ఎక్కువయ్యే ఆస్తమాకు చికిత్సలు

వ్యాయామం చేసేపుడు శారీరక శ్రమ అధికమై, ఊపిరియాడని స్థితికి చేరుకొని, ఆస్తమా ప్రేరేపితమవుతుంది. ఊపిరితిత్తుల శ్వాస మార్గ గొట్టాలలో మంట మరియు సున్నితత్వం ఏర్పడడం ఫలితంగా శరీరం ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్ ను సరఫరా చేయలేకపోతుంది. పర్యావరణ కారకాలు మరియు వ్యాయామం వలన కలిగే ఒత్తిడి ఊపిరితిత్తుల ప్రకరణమును బిగుతుగా చేస్తుంది లేదా ఆకస్మిక చైతన్యము కలుగడం వలన ఆస్తమా సమస్య ఏర్పడుతుంది.వ్యాయామం – ఆస్తమా ప్రేరణకు గల ప్రధాన కారణాలు

ప్రధానంగా వాతావరణం పొడిగా మరియు చల్లగా లేదా కాలుష్య స్థాయి ఎక్కువగా వుండడం మరియు ఎలర్జీలు పెరిగినట్లయితే, వ్యాయామం చేసేపుడు ఆస్తమా ప్రేరణ చెందుతుంది. ఈ పరిస్థితులు వ్యాయామం సంపూర్ణంగా చేసేవారికి మరియు భౌతిక ధారుడ్యం తక్కువ ఉన్నవారికి లేదా శ్వాస ఇన్ఫెక్షన్లు కలిగి ఉన్నవారికి సాధారణమైనవే. దగ్గు, శ్వాసలో గురక, ఊపిరి, ఛాతి బిగుతుపడటం, అలసట మరియు తక్కువ శక్తి స్థాయిలను కలిగి ఉండటం వంటివి వ్యాయామం చేసేపుడు ఆస్తమా ప్రేరేపించడానికి గల విలక్షణమైన లక్షణాలుగా చెప్పవచ్చు, కానీ ఇవి ఒక వ్యక్తిలో ఒకరకంగా మరో వ్యక్తికి మరోరకంగా మారుతుంటాయి.

వ్యాయామం - ఆస్తమా ప్రేరణకు గల చికిత్సావిధానం
వ్యాయామం - ఆస్తమా ప్రేరణ ఒక దీర్ఘకాలిక వ్యాధి మరియు దీనికి అందించే చికిత్సకు అధిక కాల వ్యవధి పట్టవచ్చు, ఒక్కొక్కసారి ఆ వ్యక్తి యొక్క జీవితకాలం కూడా పట్టవచ్చు.
పీల్చే స్టెరాయిడ్స్
వ్యాయామం - ఆస్తమా ప్రేరణ సమస్యను అధిక కాలం పాటు నయం చేయడానికి అత్యంత శక్తివంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. పీల్చే స్టెరాయిడ్స్ యాంటీ-ఇంఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండడం వలన అస్తమాను నియంత్రిస్తాయి. పీల్చే స్టెరాయిడ్స్ ఆస్తమా స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తున్నాయని నివేదించడం జరిగింది. పీల్చే స్టెరాయిడ్స్ ఓవర్, పుల్మికోర్ట్, ఫ్లోవెంట్, ఆజ్మకోర్ట్, ఆస్మనెక్ష్, అల్వేస్కో లేదా ఏరోబిడ్ లను కలిగి ఉండవచ్చు.
SABA (షార్ట్ ఆక్టింగ్ బేటా అగోనిస్ట్స్)
షార్ట్ ఆక్టింగ్ బీటా అగోనిస్ట్స్ కు ఇది ఒక అక్రానిమ్, ఒక రోగి తీవ్ర ఉబ్బస లక్షణాలతో బాధపడుతున్నపుడు ఈ మందును తీసుకున్నట్లయితే త్వరగా ఉపశమనం పొందవచ్చు. దీనిని వ్యాయామం - ఆస్తమా ప్రేరణ కోసం ఒక సాధారణ నివారణిగా ఉపయోగిస్తారు. SABA ను ఉబ్బసం లక్షణాలు తీవ్రంగా ఉన్నపుడు దానిని నిరోధించడానికి ఉపయోగిస్తారు మరియు డాక్టర్ మీకు అల్బుటేరాల్, ప్రోవెంటిల్, క్షొపెనెక్ష్ లేదా మక్షైర్ వంటి మందులను సూచించవచ్చు.
LABA (లాంగ్ ఆక్టింగ్ బేటా అగోనిస్ట్స్)
లాంగ్ ఆక్టింగ్ బేటా అగోనిస్ట్స్ మందులను అనుబంధ చికిత్సగా ఉపయోగిస్తారు మరియు అక్యూట్ అస్తమా మరింత తీవ్రతరం చెందినపుడు చికిత్స కోసం ఉపయోగిస్తారు. LABA ఫోరడిల్, సేరెవెంట్, పెర్ఫోర్మిస్ట్, బ్రోవన లను కలిగి ఉంటుంది
లేకోట్రేయన్ మాడిఫయ్యర్స్
ఈ మందులను స్వల్ప నిరంతర ఆస్తమా కోసం ప్రత్యామ్నాయ చికిత్సగా పరిగణిస్తారు మరియు పీల్చే స్టెరాయిడ్స్ తో కలిపి వీటిని ఉపయోగించవచ్చు. ప్రస్తుతం లేకోట్రేయన్ మాడిఫయ్యర్స్ కేవలం మూడు అందుబాటులో ఉన్నాయి అవి, ఎకోలేట్, సింగ్యులాయిర్ మరియు జ్యిఫ్లో.
అంటికోలినేట్జిక్స్
ఇది బ్రాంకోడిలేటర్ వలే పనిచేస్తుంది మరియు దీనిని అత్యవసర పరిస్థితుల్లో అక్యూట్ అస్తమాను నయం చేయడానికి SABA తో కలిపి ఉపయోగిస్తారు.
క్రోమోల్యన్ సోడియం మరియు నెడోక్రోమిల్
ఇది ఊపిరితిత్తులలోని మంట నివారణకు సహాయపడుతుంది, స్వల్ప నిరంతర మరియు అక్యూట్ ఆస్తమాకు చికిత్సగా ఉపయోగిస్తారు.
ఆస్తమా మందుల కలయిక
అనేక ఔషధ కంపెనీలు వివిధ ఆస్తమా మందులు కలయికతో ఒక ఇన్హేలర్ ను అందిస్తున్నారు దీన్ని ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నట్లయితే ఉపశమనం మరియు చికిత్స రెండిటినీ అందిస్తుంది. ఇందులో సర్వసాధారణంగా పీల్చే స్టెరాయిడ్స్ మరియు LABA వంటి అడ్వైర్ మరియు సింబికోర్ట్ ల కలయిక ఉంటుంది.
ఇమ్యునోడులేటర్స్
ఈ ఔషధాలు ప్రభావవంతమైన మరియు సమర్థవంతమైన కలయికను కలిగి ఉంటాయి ఈ కలయిక మీకు స్టెరాయిడ్స్ మిత వినియోగాన్ని అందిస్తుంది. ఈ మందులు ఆస్తమా తీవ్రంగా ఉన్న పరిస్థితులలో త్వరగా స్పందించి గణనీయంగా తగ్గిస్తుంది. ఇమ్యునోడులేటర్స్ "జోలైర్ " రూపంలో మాత్రమే అందుబాటులో ఉంది.
మిథైల్క్షన్తిన్
ఇది ఒక తేలికపాటి బ్రాంకోడిలేటర్ మరియు పీల్చే స్టెరాయిడ్స్ తో అనుబంధంగా చికిత్సలో ఉపయోగిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com