కూరిన కాకర
- November 21, 2016
కావలసిన పదార్థాలు: కాకరకాయలు (పొడుగ్గా ఉండాలి) - 6, శనగపిండి - వందగ్రాములు, ఎండు కొబ్బరికోరు - 1 కప్పు, జీలకర్ర పొడి -1 టీ స్పూను, కారం - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: కాకరకాయల్ని శుభ్రంగా కడిగి, పొడిగా తుడిచి చివర్ల వరకూ వెళ్లకుండా మధ్యలో పొడుగ్గా (లోతుగా) గాటు పెట్టుకుని గింజలు తీసేయాలి. కడాయిలో కొద్దినూనె వేసి శనగపిండి, ఎండుకొబ్బరికోరు, కారం, జీలకర్ర పొడి వేగించి ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని గాటుపెట్టిన కాకరకాయల్లో కూరాలి (విడిపోకుండా దారం కట్టుకోవచ్చు). కడాయిలో నూనె వేసి 3 కాయల చొప్పున (మూతపెట్టి) సన్నని సెగమీద దోరగా వేగించి, తర్వాత కట్టిన దారం విప్పేయాలి. వీటిని అన్నంతో కలుపుకున్నా, పప్పన్నంలో నంజుకున్నా చాలా బాగుంటాయి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









