ఈ హాలీడేస్‌కి ఒమన్ బెస్ట్ ఛాయిస్
- November 23, 2016
మస్కట్: నేషనల్ హాలీడే బుధవారం నుంచి ప్రారంభమవడంతో ఎక్కువమంది సిటిజన్లు, రెసిడెంట్స్ లాంగ్ వీకెండ్‌ని సుల్తానేట్‌లో ఎంజాయ్ చేసేందుకు ప్రణాళికలు ముందే సిద్ధం చేసుకున్నారు. మస్కట్ నివాసి ఇమ్రాన్ ఎస్ మాట్లాడుతూ, ముసాన్‌దామ్‌ను విజిట్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఒమన్‌లో చాలా హోటల్స్ రిసార్ట్స్ ఇప్పటికే ఫుల్ అయిపోయాయనీ, విమానాలేవీ ఖాళీగా లేవని చెప్పారు. ఖసబ్‌కి వెళ్ళే ఫెర్రీ సర్వీస్ వాతావరణ సమస్యల కారణంగా రద్దయ్యిందని ఆయన తెలిపారు. అహ్మద్ బెలుషి అనే సిటిజన్ మాట్లాడుతూ, షర్కియా శాండ్స్‌లో ఎంజాయ్ చేద్దామనుకుంటున్నట్లు వివరించారు. ప్రకృతి అందాల్ని ఆస్వాదించడం కన్నా నేషనల్ డే సెలబ్రేషన్స్‌ని ఇంకా గొప్పగా ఎలా ఎంజాయ్ చేస్తామని ఆయన అంటున్నారు. మస్కట్‌కి చెందిన మరో రెసిడెంట్ గుర్‌మీత్ సింగ్ మాట్లాడుతూ, తాము యూఏఈ వెళ్ళాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బిజినెస్ కొంత వీక్‌గానే ఉందని ట్రావెల్ ఏజెంట్స్ అంటున్నారు. కొంతమంది హాలీడే మూడ్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నా, చాలామంది మాత్రం సేవింగ్ మోడ్‌లో ఉండటానికే ఇష్టపడుతున్నారనీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తపడుతున్నారని ట్రావెల్ ఏజెంట్స్ వివరించారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







