ఫిలిప్పీన్స్‌లో భారత జంట కాల్చివేసిన దుండగులు
- November 24, 2016
భారత్‌కు చెందిన ఓ సిక్కుజంట ఫిలిప్పీన్స్‌లో కాల్చివేతకు గురైంది. కేమరిన్స్ సర్ ప్రావిన్స్‌లోని సిపోకోట్ పట్టణానికి చెందిన భగవంత్ సింగ్ బుట్టర్(45), అతడి భార్య జస్విందర్ కౌర్(36)ను రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు ఈరోజు కాల్చి చంపారు. ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న మార్విన్ మగ్డావోంగ్ రోడొల్ఫోలను పోలీసులు అరెస్ట్ చేశారు. దంపతులను ఎందుకు చంపాల్సి వచ్చిందన్న విషయం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. రెండు పిస్టళ్లు, మందుగుండును నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఫిలిప్పీన్స్‌లో గతంలోనూ పలువురు భారతీయులపై దాడులు జరిగాయి. చివరిగా ఈ ఏడాది ఆగస్టులో పంజాబ్‌లోని ఫగ్వారాకు చెందిన 26 ఏళ్ల యువకుడిని శాంటియాగోలో దుండగులు కాల్చి చంపారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







