ఆరుగురు తీవ్రవాద అనుమానితులకు జీవిత ఖైదు
- November 24, 2016మనామా: హై క్రిమినల్ కోర్ట్, ఆరుగురు తీవ్రవాద అనుమానితులకు జీవిత ఖైదు విధించింది. పేలుడు పదార్థాలను కలిగి ఉన్నారనీ, వాటిని వినియోగించారనే అభియోగాలు వారిపై మోపబడ్డాయి. మమీర్‌లో ఓ పోలీస్ అధికారిని చంపేందుకు కూడా ఈ వ్యక్తులు కుట్ర పన్నిన కేసులో దోషులుగా తేలారని చీఫ్ ప్రాజిక్యూటర్ హమాద్ షహీన్ చెప్పారు. 2015 మే 30న మమీర్ విలేజ్‌లో బాంబుల్ని పెట్టి ఓ పోలీస్ అధికారిని చంపడానికి ప్లాన్ చేశారు. అనుమానాస్పదంగా అక్కడే నక్కి ఉన్నవారిని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత బాంబుని కనుగొని నిర్వీర్యం చేశారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. బాంబు ఒకవేళ పేలి ఉంటే తీవ్రమైన నష్టం వాటిల్లేది. అన్ని వాదనల్నీ విన్న న్యాయస్థానం, సాక్ష్యాధారాల్ని పరిశీలించి, నిందితులకు జీవిత ఖైదును విధించింది. నిందితుల తరఫున కూడా వాదనలకు ఆస్కారం కలిగిందిగానీ, నేర నిరూపణ అవడంతో నిందితులకు శిక్ష తప్పలేదు.
తాజా వార్తలు
- IIFA ఉత్సవం.. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం..
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?