టెర్రాస్‌పై జీవనం గడుపుతున్న వ్యక్తికి ఊరట
- November 24, 2016
సంజీవ్ రాజన్ అనే భారతీయ ఎలక్ట్రీషియన్, ఎనిమిది నెలలకు పైగా టెర్రాస్‌పైనే జీవనం సాగిస్తున్నాడు. అతని ఆవేదనా భరితమైన జీవితం గురించి తెలుసుకున్న ఓ ఫిలాంత్రపిస్ట్, బాధితుడికి తక్షణ సాయం కింద 5,000 దిర్హామ్‌లు అందజేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 1 మిలియన్ (సుమారు 55,000 దిర్హామ్‌లు) బాధితుడి బ్యాంకు ఖాతాకి ట్రాన్స్‌ఫర్ చేయనున్నట్లు వెల్లడించారాయన. బాధితుడి పేరు సంజీవ్ రాజన్ కాగా, ఆయన్ని ఆదుకునేందుకు ముదుకొచ్చిన వ్యక్తి పేరు రబీహ్ రబీముల్లా. హెల్త్‌కేర్ గ్రూప్ అయిన షిఫా అల్ జజీరా మెడికల్ గ్రూప్ చైన్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని, బాధితుడ్ని ఆదుకుంటున్నారు. ఒమన్ నుంచి సరాసరి తన వద్దకే వచ్చి ఈ సాయం అందించడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నట్లు సంజీవ్ చెప్పాడు. ఎనిమిది నెలలుగా ఒక్క రూపాయి కూడా తనకు జీతం రాకపోవడంతో దుర్భర జీవితంగ డిపానని అన్నాడు సంజీవ్. ఇంకో వైపున ఇండియన్ కాన్సులేట్ కూడా సంజీవ్‌కి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. సంజీవ్ పనిచేస్తున్న కంపెనీ రిటర్న్ పాస్‌పోర్ట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయగా, అప్పటివరకూ అతని సంరక్షణ చూసుకునేందుకు అంగీకరించింది కాన్సులేట్.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్‌లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!