ఈ వారంతంలో యూఏఈలో దుమ్ము, వర్షం వుండొచ్చు
- November 24, 2016
మనామా: ఈ వారాంతంలో బీచ్ వద్ద ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారా? అయితే జాగ్రత్త. వాతావరణ శాఖ భారీ వర్షాలు, అలాగే దుమ్ముతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందనే హెచ్చరికల్ని పంపిస్తోంది. గుఉవారం దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఫుజారియా, రస్ అల్ ఖైమా భారీ వర్షాలతో తడిసి ముద్దయ్యాయి. వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని, ప్రజల బయటకు వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నారు. దుబాయ్‌లో శుక్రవారం ఉదయం నుంచీ దుమ్ము ధూళితో కూడిన వాతావరణమే కనిపించనుంది. రస్ ఖైమా, సమీప ప్రాంతాలు మాత్రం భారీ వర్షాలతో తడిసి ముద్దవనున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ మరియు సెస్మాలజీ హెచ్చరిస్తోంది. సముద్రంలో కెరటాల తీవ్రత అధికంగా ఉంటుంది గనుక, సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అరేబియన్ గల్ఫ్‌లో కెరటాలు 8 నుంచి 10 అడుగుల ఎత్తువరకు ఉండొచ్చు. 12 అడుగుల వరకూ పెరిగినా ఆశ్చర్యం కాదు. ఒమన్ సీ మాత్రం పెద్దగా సమస్యలు ఉండవనీ, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండక తప్పదని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







