నటుల వద్ద నల్లధనం ఉండదని అంటున్న నాగబాబు

- November 29, 2016 , by Maagulf
నటుల వద్ద నల్లధనం ఉండదని అంటున్న నాగబాబు

భారత దేశంలో గత ఇరవై రోజుల నుంచి పెద్ద నోట్ల చెలామణి రద్దుపై సామాన్య ప్రజలు పడుతున్న అవస్థల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నల్లధనం అరికట్టేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయంపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ కష్టం కేవలం యాభై రోజులు మాత్రమే అని పెద్ద నోట్ల చెలామణి పూర్తి రద్దయిన తర్వాత నల్లకుభేరులు బయటకు వస్తారని అప్పుడు నల్లధనం పూర్తి స్థాయిలో నిర్మూలించ అవకాశం ఉంటుందని ప్రధాని అంటున్నారు.
 
ఏది ఏమైనా పెద్దనోట్ల ప్రభావం మాత్రం సినిమా ఇండస్ట్రీపై భారీగానే పడింది.

ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దలు ఈ అంశంపై రక రకాలు గా చర్చించుకుంటున్నారు. కొన్ని సినిమాలు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ప్రధాని నరేంద్ర మోడీ కి పూర్తిగా మద్దతు ఇచ్చారు. తాజాగా ఆయన నల్లధనంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఇండస్ట్రీలో హీరోల వద్ద అసలు బ్లాక్ మనీ అనేది ఎవ్వరి దగ్గర కూడా లేదని , ఒకవేళ ఇండస్ట్రీ లో బ్లాక్ మనీ అనేది ఏదైనా వస్తే అది కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళ వల్ల మాత్రమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
 
కొంత మంది రియల్ దందాలు నిర్వహిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని అలాంటి వారు పెట్టుబడులు పెట్టి సినిమాలు నిర్మిస్తున్నారని అలాంటి వారి వద్ద నల్లధనం ఉంటుంది కానీ కష్టపడి సినిమాల్లో నటించే నటీ, నటుల వద్ద నల్లధనం ఉండదని అంటున్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళ వల్ల మాత్రమే బ్లాక్ మనీ ఇండస్ట్రీ లోకి వచ్చిందని అన్నాడు . అయితే టాప్ హీరోలు అందరూ తీసుకుంటున్న రెమ్యునరేషన్ లో ఎంత సొమ్ము 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com