ఒక్కొక్క ఉద్యోగికి రూ.10 వేల నగదు...

- December 01, 2016 , by Maagulf
ఒక్కొక్క ఉద్యోగికి రూ.10 వేల  నగదు...

ఏపీ సచివాలయంలోని ఏర్పాటు చేసిన ఎస్‌బీఐలోగురువారం ఉద్యోగులు బారులు తీరారు. ఒక్కొక్క ఉద్యోగికి రూ.10 వేల చొప్పున నగదు అందజేశారు. దీంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో నగదు, చిల్లర సమస్యతో ప్రజలు సతమతమవుతున్నవిషయం తెలిసిందే. ఒకటో తేదీ రానే వచ్చింది. బ్యాంక్ అకౌంట్లలో జీతాలు పడినా వాటిని తీసుకోడానికి ప్రజలు చాలా పాట్లు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు రూ. 10 వేల చొప్పున అందజేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇవాల ఉద్యోగులు డబ్బులు తీసుకుంటూ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com