45వ జాతీయ దినోత్సవం ఎతిహాద్ 45 శాతం డిస్కౌంట్
- December 01, 2016
ఎతిహాద్ ఎయిర్‌వేస్ తమ ప్రయాణీకులకు 45 శాతం డిస్కౌంట్ ఫేర్స్‌ని యూఏఈ నేషనల్ డే సందర్భంగా ప్రకటించింది. 45 డెస్టినేషన్లకు సంబంధించి ఎకానమీ, బిజినెస్ క్లాస్ ప్రయాణీకులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రయాణీకులు డిసెంబర్ 2 లోపు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 15 వరకు ప్రయాణాలు చేసేందుకు వీలుంది. డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది ఆయా డెస్టినేషన్లకు భిన్నంగా ఉండొచ్చు. మేగ్జిమమ్ డిస్కౌంట్ 45 శాతం అని ఎతిహాద్ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఎతిహాద్ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇండియన్ సబ్ కాంటినెంట్‌లోని డెస్టినేషన్లకు ఎకానమీ క్లాస్ రిటర్న్ ఫేర్స్ అతి తక్కువగా 660 దిర్హామ్‌లు ముంబైకి, బెంగళూరుకి 809, ఢిల్లీకి 739 దిర్హామ్‌లుగా నిర్ణయించారు. ఎమిరేట్స్ కూడా స్పెషల్ ఫేర్స్‌ని ఇప్పటికే ప్రకటించింది డిసెంబర్ 8 లోపు బుక్ చేసుకున్న వారు డిసెంబర్ 1 నుంచి జూన్ 15 వరకు డిస్కౌంట్ ఫేర్‌తో ప్రయాణించేందుకు వీలుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







